స్వర్ణాంధ్ర విజన్‌కు నేడు కీలక రోజు.. రూ.18 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: ప్రధాని మోదీ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు రూ.18 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు విజన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిదర్శనమని ప్రశంసించారు.

1 ఆగస్టు, 2026 2:02 PM•ByNarender Kumar Nangunoori

Share this article

స్వర్ణాంధ్ర విజన్‌కు నేడు కీలక రోజు.. రూ.18 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: ప్రధాని మోదీ

Janavaani Image

విజయనగరం, ఆగస్టు 1: స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనలో నేటి రోజు కీలక మైలురాయిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

ప్రధాని మాట్లాడుతూ రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని, ఇవి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సీఎం చంద్రబాబు విజన్‌కు మరో గొప్ప నిదర్శనమని ప్రశంసించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి, విజయనగరం పైడితల్లి అమ్మవారికి నమస్కారాలు తెలిపిన ప్రధాని.. 13,500 మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన థింసా నృత్యం చరిత్రాత్మకమని కొనియాడారు. అభివృద్ధితో పాటు సాంస్కృతిక వైభవాన్ని కూడా ప్రపంచానికి చాటారని అన్నారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో వేగంగా అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తోందని ప్రధాని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందన్నారు. 2014కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం వాటి సంఖ్య 166కు పెరిగిందని ప్రధాని వెల్లడించారు. దేశంలోని చిన్న పట్టణాలను కూడా విమాన సేవలతో అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. ఒకే కుటుంబం పేర్లను విమానాశ్రయాలకు పెట్టే సంస్కృతికి స్వస్తి పలికామని, అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు, భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని గుర్తు చేశారు.

ఏపీకి భారీ మౌలిక సదుపాయాల విస్తరణ

విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు పోర్టుల అభివృద్ధి జరుగుతోందని, మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నామని ప్రధాని తెలిపారు. పీఎం గతిశక్తి కార్యక్రమం ద్వారా రైల్వేలు, రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

పారిశ్రామికంగా ఏపీకి ప్రాధాన్యం

సాఫ్ట్‌వేర్, ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ యువత ప్రతిభ కనబరుస్తోందని ప్రధాని ప్రశంసించారు. విశాఖలో సెమీకండక్టర్ పరిశ్రమకు శంకుస్థాపన చేశామని, నక్కపల్లిలో మరో ఫార్మా కంపెనీ రాబోతోందని వెల్లడించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను ఆసియాలోనే ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, రాయలసీమలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. దేశంలో బ్లూ ఎకానమీ అభివృద్ధి చేస్తున్నాం. దేశానికి ఫార్మా హబ్‌గా ఏపీ మారబోతోంది. నక్కపల్లిలో మరో ఫార్మా కంపెనీ రాబోతోంది. విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ను ఆసియాలోనే గొప్ప పారిశ్రామిక కేంద్రంగా మారుస్తాం.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు