30 ఏళ్లుగా ఆ థియేటర్‌లో ఒకే సినిమా.. రూ.100 కోట్లతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది..!

ఒక సినిమా థియేటర్లలో వారం, నెల లేదా ఏడాది ఆడటం పెద్ద విషయమే. కానీ 31 ఏళ్లుగా ఒకే థియేటర్‌లో ప్రతిరోజూ ప్రదర్శితమవుతూ ఇప్పటికీ ప్రేక్షకులను రప్పిస్తున్న సినిమా గురించి ఎప్పుడైనా విన్నారా? ఒక దశలో ఈ షోను నిలిపివేయాలని యాజమాన్యం నిర్ణయించినా.. అభిమానుల నిరసనతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అసలు మూడు దశాబ్దాలుగా చెక్కుచెదరని ఈ రికార్డు ఏ సినిమాది? దాని వెనుక ఉన్న కథ ఏంటి? అనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

29 జులై, 2026 11:47 AM•ByLaharika

Share this article

30 ఏళ్లుగా ఆ థియేటర్‌లో ఒకే సినిమా.. రూ.100 కోట్లతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది..!

కొన్ని సినిమాలు ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవు. చూసిన ప్రతీ సారి మళ్లీ కొత్తగా చూస్తున్నట్లే అనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో 'దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే' ఒకటి. ఎవర్‌గ్రీన్ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ సినిమాల్లో ఈ మూవీ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. అసలు చాలా మంది హిందీ భాష రాని వాళ్లు కూడా ఈ సినిమా కోసం అప్పట్లో థియేటర్‌లకు ఎగబడ్డారంటే ఎంత గొప్ప లవ్ స్టోరీ మూవీనో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, కాజోల్ హీరో, హీరోయిన్‌లుగా నటించారు. సినిమా వచ్చి మూడు దశాబ్దాలు దాటుతున్నా సరే.. ఇప్పటికీ ఈ సినిమాకున్న యుఫోరియా ఏ మాత్రం తగ్గలేదు అనడంలో అతిశయొక్తి కాదు.

ఆదిత్య చోప్రా దర్శఖత్వ వహించిన ఈ సినిమా అక్టోబర్ 20, 1995న రిలీజై ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. అసలు అప్పట్లో నెల రోజుల వరకు ఈ సినిమాకు టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమానో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీక్ డేస్, వీకెండ్స్ ఇలా తేడా లేకుండా దాదాపు నెల రోజుల పాటు చాలా థియేటర్‌లలో హౌజ్ పుల్ బోర్డులు పడిపోయాయి. కాగా.. ఈ సినిమా క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే ఇప్పటికీ ఓ థియేటర్‌లో ఈ సినిమా ప్రదర్శితం అవుతుంది. అంటే దాదాపుగా 30 ఏళ్లకు పైగా ఇదే సినిమా ఆ థియేటర్లో నడుస్తుంది.

ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్‌లో ప్రతీ రోజు మార్నింగ్‌ షోలో ఈ సినిమా ప్రదర్శితం అవుతుంది. అంతేకాదు ఆ థియేటర్‌లో బాల్కనీ టికెట్ ధర రూ.50 కాగా, సాధారణ టికెట్ ధర రూ.30 మాత్రమే. కాలేజ్ స్టూడెంట్స్, కొత్తగా పెళ్లైన జంటలు, ప్రేమికులు ఇలా చాలా మంది ఇప్పటికీ ఈ సినిమా చూడడానికి వస్తుంటారు.

సండేస్‌లో అయితే దాదాపు 500 మంది వరకు ఈ సినిమా చూస్తారని థియేటర్ యాజమాన్యం చెబుతుంది. ముంబై వాళ్లు మాత్రమే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాల వాళ్లు విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా ఈ షోను చూసేందుకు వస్తుంటారు. ఒక దశలో 2015లో ఈ సినిమాను ఆపేయాలని థియేటర్ యాజమాన్యం భావించిందట. కానీ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించడంతో అప్పటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.

ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, కాజోల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సాధారణ ప్రేమకథే అయినా దాన్ని చూపించిన విధానం ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.102 కోట్లకు పైగా వసూలు చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా దక్కింది. అమ్రిష్ పూరి, ఫరీదా జలాల్, అనుపమ్ ఖేర్‌లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జతిన్ లలిత్ సంగీతం అందించాడు. ఇప్పటికీ ఈ సినిమా పాటలు చాలా మంది ప్లేలిస్ట్‌లో ఉంటాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు