గతేడాది తన కొత్త ఇంట్లో ఘనంగా గృహప్రవేశం చేసి వార్తల్లో నిలిచింది రంగమ్మత్త. ఆ సమయంలో ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి అదే ఇంటి లగ్జరీ నిర్మాణం, కాస్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా కెరీర్‌లో సంపాదించిన డబ్బుతో తనకు నచ్చిన విధంగా ఈ డ్రీమ్ హౌస్‌ను నిర్మించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో ఉన్న ఈ లగ్జరీ హౌస్‌లో నాలుగు బెడ్‌రూమ్‌లు, విశాలమైన హాల్, ప్రత్యేక డ్రాయింగ్ రూమ్, అత్యాధునిక మినీ థియేటర్ ఉన్నాయి. ఇంట్లోని ప్రతి మూలను ప్రీమియం ఇంటీరియర్‌తో తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. ఆధునిక జీవనశైలికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, ప్రతి విభాగాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.
ఈ ఇంటి విలువ దాదాపు రూ.50 కోట్ల వరకు ఉంటుందని విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యుత్తమ మెటీరియల్స్‌తో ఇంటిని నిర్మించినట్లు సమాచారం. ముఖ్యంగా హోమ్ థియేటర్ కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి, భారీ స్క్రీన్‌తో పాటు ఖరీదైన సౌండ్ సిస్టమ్‌ను కూడా అమర్చారట. అలాగే తన కలల ఇంటికి 'శ్రీరామ సంజీవని' అనే అందమైన పేరును పెట్టుకోవడం విశేషం.
ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టెలివిజన్ షోలతో బిజీగా కొనసాగుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉంటూ గ్లామరస్ ఫొటోలు, ఫ్యామిలీ మూమెంట్స్‌ను పంచుకుంటుంది. తన వృత్తి జీవితాన్ని, కుటుంబ బాధ్యతలను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న అనసూయకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆమెకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా క్షణాల్లో వైరల్ అవుతోంది.




















