హీరోయిన్‌గా కాదు.. నిర్మాతగా దీపికా పదుకొణె కొత్త అడుగు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ ఓ ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్‌తో ‘రాకా’ షూటింగ్ పూర్తి చేసిన దీపికా, ఇప్పుడు హాలీవుడ్ సూపర్‌హిట్ ‘ది ఇంటెర్న్’ బాలీవుడ్ రీమేక్‌ను నిర్మించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

18 సెప్టెంబర్, 2026 5:19 PM•ByNarender Kumar Nangunoori

Share this article

హీరోయిన్‌గా కాదు.. నిర్మాతగా దీపికా పదుకొణె కొత్త అడుగు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రాకా’ షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేసినట్లు సమాచారం. ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ వార్తలకు భిన్నంగా దీపికా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

హీరోయిన్‌గా కాదు.. నిర్మాతగా!

హాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ‘ది ఇంటెర్న్’ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నా హాథవే, రాబర్ట్ డి నీరో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సుమారు 35 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఈ రీమేక్‌లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అమిత్ శర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను దీపికా పదుకొణె తన కా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఒరిజినల్ కథతో పోలిస్తే హిందీ వెర్షన్‌లో చేసిన మార్పులు, పాత్రలను మరింత ఎమోషనల్‌గా తీర్చిదిద్దిన విధానం నచ్చడంతోనే దీపికా నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ సినిమా విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

‘కా ప్రొడక్షన్స్‌’లో మూడో సినిమా

దీపికా పదుకొణె సినిమాల నిర్మాణం కోసం కా ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్‌పై ‘ఛపాక్’ చిత్రాన్ని నిర్మించారు. అలాగే భర్త రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘83’ సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ‘ది ఇంటెర్న్’ రీమేక్ నిజమైతే కా ప్రొడక్షన్స్‌పై తెరకెక్కే మూడో సినిమా కానుంది.

కథ ఏంటంటే?

‘ది ఇంటెర్న్’ కథ ఓ వృద్ధుడి చుట్టూ తిరుగుతుంది. రిటైర్మెంట్ జీవితాన్ని ఆస్వాదించలేక ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరతాడు. ఆ సంస్థకు ఓ మహిళ యజమానిగా ఉంటుంది. ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్న ఆమె కంపెనీని చేజిక్కించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు ఎదుర్కొంటుంది. ఆ సమయంలో ఆ వృద్ధుడు ఆమెకు ఎలా అండగా నిలిచాడు? ఆమె జీవితాన్ని ఎలా చక్కదిద్దాడు? అనే అంశాలతో కథ సాగుతుంది. బాలీవుడ్ రీమేక్‌లో దీపికా పదుకొణె గెస్ట్ అప్పియరెన్స్‌లో కనిపించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.

‘కల్కి’ తర్వాత మరోసారి..

అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కలిసి ప్రభాస్ హీరోగా నటించిన 'క‌ల్కి 2898 ఏడీ' లో కనిపించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘ది ఇంటెర్న్’ రీమేక్ ద్వారా మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు