బాలయ్య హెల్త్ బులిటెన్ విడుదల.. ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆస్పత్రి కీలక ప్రకటన

నటసింహం నందమూరి బాలకృష్ణకు షూటింగ్ సందర్భంగా గాయమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బాలయ్య ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

22 జులై, 2026 11:07 PM•ByNarender Kumar Nangunoori

Share this article

బాలయ్య హెల్త్ బులిటెన్ విడుదల.. ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆస్పత్రి కీలక ప్రకటన

సినిమా డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణకు షూటింగ్ సందర్భంగా గాయమైన విషయం తెలిసిందే. రాజమండ్రిలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్‌లో ప్రమాదవశాత్తు గాయపడిన నందమూరి బాలకృష్ణను ముందుగా స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎయిర్‌లిఫ్ట్ ద్వారా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కండరాల కణజాలంలో రక్తం గడ్డకట్టడంతో పాటు వాపు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇది మజిల్ టియర్ లక్షణాలను సూచిస్తున్నట్లు ప్రాథమిక పరీక్షల్లో గుర్తించినట్లు తెలిపారు.

ప్రస్తుతం ఆర్థోపెడిక్ నిపుణుల బృందం పర్యవేక్షణలో బాలయ్యకు సమగ్ర వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆయన గత వైద్య చరిత్రను పరిగణనలోకి తీసుకుని, వివిధ విభాగాల వైద్యులతో కూడిన ప్రత్యేక బృందం చికిత్స అందిస్తోంది.

ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఐజీ ఆస్పత్రి హెల్త్ బులిటెన్‌లో స్పష్టం చేసింది. అన్ని వైద్య పరీక్షలు పూర్తైన అనంతరం తదుపరి చికిత్సపై తుది నిర్ణయం తీసుకుంటామని వైద్యులు వెల్లడించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు