'స్పైడర్ మ్యాన్', 'రావు బహదూర్‌'తో పాటు.. ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల ఫుల్ లిస్ట్!

ఈ వారం సినీ ప్రేక్షకులకు థియేటర్లలోనూ, ఓటీటీలోనూ వినోదానికి కొదవ లేదు. ఒకవైపు 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే', 'శ్రీనివాస మంగాపురం' లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు ఇంట్లోనే కొత్త కంటెంట్ చూడాలనుకునే వారి కోసం పలు ఓటీటీ వేదికలు భారీ లైనప్‌తో వస్తున్నాయి. గత కొన్ని వారాలతో పోలిస్తే ఈసారి థియేటర్లలో మిస్ అయిన సినిమాలతో పాటు కొత్త వెబ్ సిరీస్‌లు, హాలీవుడ్, కొరియన్, సౌత్ ఇండియన్ కంటెంట్ కూడా ఒకేసారి అందుబాటులోకి రానుంది.

29 జులై, 2026 11:34 PM•ByLaharika

Share this article

'స్పైడర్ మ్యాన్', 'రావు బహదూర్‌'తో పాటు.. ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజవుతున్న సినిమాల ఫుల్ లిస్ట్!

థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు:

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే:

మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది ఒకటి. టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా, గత స్పైడర్ మ్యాన్ సినిమాల తర్వాత పీటర్ పార్కర్ జీవితంలో చోటు చేసుకున్న కొత్త పరిణామాల నేపథ్యంలో సాగనుంది. ప్రపంచం మొత్తం తనను మర్చిపోయిన తర్వాత స్పైడర్ మ్యాన్ ఎలా ముందుకు సాగాడు? కొత్త శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమా జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

శ్రీనివాస మంగాపురం:

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా శ్రీనివాసం మంగాపురం. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. రషా తదాని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కీలక రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా జూలై 30న విడుదల కాబోతుంది.

ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు:

నెట్‌ఫ్లిక్స్ (Netflix):

రావు బహదూర్(తెలుగు మూవీ)-జూలై 31

రాత్ (బ్రెజిలియన్ సిరీస్)-జూలై 29

ఫైనల్ ప్రాజెక్ట్ (మెక్సికన్ సిరీస్)-జూలై 29

ది ఐడాహో కాలేజ్ మర్డర్స్: కాలేజ్ నైట్‌మేర్ (ఇంగ్లీష్ సిరీస్)-జూలై 29

ది బాంబింగ్ ఆఫ్ పాన్ యామ్ 103 (ఇంగ్లీష్ సిరీస్)-జూలై 30

గట్టా కుస్తీ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా)-జూలై 31

అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video):

సూపర్ గర్ల్ (ఇంగ్లీష్/తెలుగు డబ్బింగ్)-జూలై 28

ది డెవిల్స్ మౌత్ (ఇంగ్లీష్ సినిమా)-జూలై 29

లవ్ ఓ లవ్ (తమిళం/తెలుగు డబ్బింగ్)-జూలై 31

బ్యాట్‌మ్యాన్: కేప్డ్ క్రూసేడర్ – సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)-జూలై 31

జియో హాట్‌స్టార్ (JioHotstar):

చిన్ని చిన్ని ఆశై (మలయాళం/తెలుగు డబ్బింగ్)-జూలై 28

ది డెవిల్ వేర్స్ ప్రాడా 2 (ఇంగ్లీష్ సినిమా)-జూలై 29

హార్ట్ బీట్ – సీజన్ 3 (తమిళం/తెలుగు డబ్బింగ్)-జూలై 30

భోజ్‌పురి బవాల్ (భోజ్‌పురి రియాలిటీ షో)-ఆగస్టు 2

ఆహా (Aha):

ఆజాదీ 501 (తెలుగు సిరీస్)-జూలై 29

దీవానా (తెలుగు సినిమా)-జూలై 31

జీ5 (ZEE5):

బాలన్ ది బాయ్ (మలయాళం/తెలుగు డబ్బింగ్ సినిమా)-జూలై 31

అబ్జెక్షన్ మై లార్డ్ (తెలుగు వెబ్ సిరీస్)-జూలై 31

హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ సినిమా)-జూలై 31

సోనీ లివ్ (Sony LIV):

ది లెజెండ్ ఆఫ్ కర్ణ (హిందీ వెబ్ సిరీస్)-జూలై 31

ఈ వారం థియేటర్లలో శ్రీనివాస మంగాపురం, స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ప్రధాన ఆకర్షణలు కాగా, ఓటీటీలో రావు బహదూర్, గట్టా కుస్తీ 2, దీవానా, అబ్జెక్షన్ మై లార్డ్, బాలన్ ది బాయ్ వంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు