టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై దుండగుల దాడి

కోల్‌కతాలో టీఎంసీ నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. గురువారం తెల్లవారుజామున మాస్కులు, హెల్మెట్లు ధరించి వచ్చిన వ్యక్తులు కార్యాలయంలోకి చొరబడి అద్దాలు పగులగొట్టి, వస్తువులను ధ్వంసం చేశారు.

3 సెప్టెంబర్, 2026 12:47 PM•ByNarender Kumar Nangunoori

Share this article

టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై దుండగుల దాడి

Social Media Image

కోల్‌కతా, సెప్టెంబర్ 03 (జనవాణి): కోల్‌కతాలో టీఎంసీ నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై దుండగులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. గురువారం తెల్లవారుజామున మాస్కులు, హెల్మెట్లు ధరించిన కొందరు వ్యక్తులు కార్యాలయంలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. కార్యాలయంలోని వస్తువులను చెల్లాచెదురు చేయడంతో పాటు అద్దాలను పగలగొట్టారు. కొన్ని వస్తువులను తమ వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అభిషేక్ బెనర్జీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ దాడి వెనుక బీజేపీ హస్తం ఉందని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. పశ్చిమబెంగాల్ గవర్నర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై హింస, దాడులు, బెదిరింపులు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

తనపై ముఖ్యమంత్రి సువేందు అధికారి బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. టీఎంసీ పార్టీని, తనను చూసి సీఎం భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనను తాము ఎప్పటికీ మర్చిపోబోమని స్పష్టం చేశారు.

టీఎంసీ ఐటీ సెల్ ఇన్‌చార్జ్ ఉపాసన చౌదరి కూడా ఈ ఘటనపై స్పందించారు. బీజేపీతో సంబంధం ఉన్న వ్యక్తులే దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ముందుగా కార్యాలయ భద్రతా సిబ్బందిపై దాడి చేసి, అనంతరం బలవంతంగా లోపలికి ప్రవేశించి విధ్వంసం సృష్టించారని తెలిపారు. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని ఉపాసన చౌదరి ఆరోపించారు. ఇదే సమయంలో పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించి, ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు