కౌశికి అమావాస్య సందర్భంగా కోల్‌కతాలోని కాళీఘాట్ కాళీమాత ఆలయాన్ని బెంగాల్ సీఎం సువేందు అధికారి సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ సంప్రదాయ భోగ్‌ను స్వీకరించారు. చేపలు, బసంతి పులావ్‌తో కూడిన ఈ నైవేద్యాన్ని ఆయన స్వీకరిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కోల్‌కతాలో టీఎంసీ నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. గురువారం తెల్లవారుజామున మాస్కులు, హెల్మెట్లు ధరించి వచ్చిన వ్యక్తులు కార్యాలయంలోకి చొరబడి అద్దాలు పగులగొట్టి, వస్తువులను ధ్వంసం చేశారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనకోడలు బ్రిష్టీ ముఖర్జీ ఘటక్ (28) బలవన్మరణానికి పాల్పడ్డారు. బీర్భూమ్ జిల్లా రాంపూర్‌హాట్‌లోని తన నివాసంలో మంగళవారం మధ్యాహ్నం ఆమె మృతదేహం లభ్యమైంది.
నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల తర్వాత కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన కోల్‌కతాకు చెందిన 32 మంది సభ్యుల బృందం ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ బృందంలో 30 మంది యాత్రికులు, ఇద్దరు టూర్ మేనేజర్లు ఉన్నారు.
కోల్‌కతాలోని న్యూమార్కెట్ ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రీ స్కూల్ వీధిలోని ఓ హోటల్‌లో అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో చిన్నారి సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా బంగ్లాదేశీయులేనని అధికారులు తెలిపారు.
వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి తగ్గించాయి. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన తాజా సవరణతో దేశంలోని పలు నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు రూ.202 నుంచి రూ.209 వరకు తగ్గాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ సంస్థలు, చిన్న వ్యాపారులకు కొంత ఉపశమనం లభించనుంది.