హైదరాబాద్‌లో భారీ గంజాయి పట్టివేత.. 425 కేజీలు స్వాధీనం

గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్‌రోడ్డుపై తనిఖీలు నిర్వహించి డీసీఎంలో తరలిస్తున్న 425 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

19 సెప్టెంబర్, 2026 12:26 PM•ByNarender Kumar Nangunoori

Share this article

హైదరాబాద్‌లో భారీ గంజాయి పట్టివేత.. 425 కేజీలు స్వాధీనం

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (జనవాణి): నగరంలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శనివారం పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.

ఔటర్ రింగ్‌రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తుండగా డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 425 కేజీల గంజాయి పోలీసులకు పట్టుబడింది. దీంతో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రాథమిక విచారణలో నిందితులు ఒడిశా నుంచి గంజాయిని మహారాష్ట్రలోని సోలాపూర్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు డీసీఎంను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.

నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు సమాచారం.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు