హైదరాబాద్,సెప్టెంబర్ 18 (జనవాణి): ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది.
విదేశీ సంస్థకు సమన్లు అందకపోవడంతో విచారణ వాయిదా పడినట్లు కేటీఆర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఆ సంస్థకు ఈమెయిల్ ద్వారా సమన్లు పంపించాలని పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. గతంలో సమన్ల కోసం వేసిన పిటిషన్‌ను కోర్టు రిటర్న్ చేసిందని, మరోసారి సమన్ల కోసం పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించారు.
‘హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే రేస్’
ఫార్ములా ఈ-రేస్‌ను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే నిర్వహించామని కేటీఆర్ తెలిపారు. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని, న్యాయవ్యవస్థపై తనకు అపారమైన నమ్మకం ఉందన్నారు. ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయవ్యవస్థ తమకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.
‘టార్గెట్ కేసీఆర్‌గానే కాంగ్రెస్ ప్రభుత్వం’
పక్క రాష్ట్రాలు తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకు అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమిళనాడు సీఎం విజయ్ ఫార్ములా ఈ-రేస్ కోసం లండన్ వెళ్లారని ప్రస్తావిస్తూ, ఇతర రాష్ట్రాలు బ్రాండ్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తుంటే తెలంగాణలో మాత్రం తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమపై లక్ష కోట్ల రూపాయలు సంపాదించారంటూ అసత్య ఆరోపణలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రూ.1000 కోట్లు ఇచ్చి మా పేరుపై ఉన్న లక్ష కోట్ల ఆస్తులు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాం.
Loading Tweet...




















