ప్రియురాలు మాట్లాడటం లేదని..ఇంటిపై పెట్రోల్ బాంబ్ విసిరిన యువకుడు

ప్రియురాలు వారం రోజులుగా మాట్లాడటం లేదన్న కోపంతో ఓ యువకుడు మద్యం మత్తులో ఆమె ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరాడు.

4 సెప్టెంబర్, 2026 5:07 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ప్రియురాలు మాట్లాడటం లేదని..ఇంటిపై పెట్రోల్ బాంబ్ విసిరిన యువకుడు

మదురై,సెప్టెంబర్ 04 (జనవాణి): ప్రియురాలు తనతో మాట్లాడటం లేదన్న ఆగ్రహంతో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఆమె ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరాడు. అయితే అది గోడకు తగిలి తిరిగి అతడి పక్కనే పడి పేలింది. దీంతో భయాందోళనకు గురైన యువకుడు అక్కడి నుంచి పరుగులు తీశాడు.

తమిళనాడులోని మదురై జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. 23 ఏళ్ల నాగార్జున ఓ యువతితో గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అయితే వారం రోజులుగా ఆమె నాగార్జునతో మాట్లాడేందుకు నిరాకరించింది. దీంతో ఆమెపై ఆగ్రహం పెంచుకున్న అతడు మద్యం మత్తులో ఈ చర్యకు పాల్పడ్డాడు.

శుక్రవారం తెల్లవారుజామున ప్రియురాలి ఇంటి సమీపానికి వెళ్లిన నాగార్జున.. ఆమె ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరాడు. అది గోడకు తగిలి తిరిగి అతడి సమీపంలోనే పడి పేలింది. మంటలు చెలరేగడంతో భయపడిన నాగార్జున అక్కడి నుంచి పరారయ్యాడు.

మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రియురాలు తనతో మాట్లాడటం లేదన్న అసహనంతోనే మద్యం మత్తులో నాగార్జున ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసు అధికారి తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Loading Tweet...

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు