'డయల్ యువర్ ఎమ్మెల్యే'కు విశేష స్పందన.. 80కిపైగా కాల్స్‌కు స్వయంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు నిర్వహించిన 'డయల్ యువర్ ఎమ్మెల్యే' కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

1 ఆగస్టు, 2026 6:30 PM•ByRalin

Share this article

'డయల్ యువర్ ఎమ్మెల్యే'కు విశేష స్పందన.. 80కిపైగా కాల్స్‌కు స్వయంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, ఆగస్టు 1: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు నిర్వహించిన 'డయల్ యువర్ ఎమ్మెల్యే' కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దాదాపు 80కిపైగా ఫోన్ కాల్స్‌కు స్వయంగా స్పందించి, ప్రజలు తెలిపిన సమస్యలను శ్రద్ధ విన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజల నుంచి ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, భూ సమస్యలు, గ్రామాల్లో మౌలిక వసతులు, పెండింగ్ అభివృద్ధి పనులు, తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి.. ప్రతి సమస్యను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Way2News ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి సమస్యను బాధ్యతాయుతంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా Way2News ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'డయల్ యువర్ ఎమ్మెల్యే' కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చే అవకాశం కల్పించడం ప్రశంసనీయమని అన్నారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు