ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఆగస్టు 5 నుంచి దరఖాస్తులు

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (KNRUHS) నోటిఫికేషన్ విడుదల చేసింది.

4 ఆగస్టు, 2026 12:47 PM•ByRalin

Share this article

ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఆగస్టు 5 నుంచి దరఖాస్తులు

హైదరాబాద్, జూలై4 : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (KNRUHS) నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ యూజీ-2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 5 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది.

దరఖాస్తులను https://tsmedadm.tsche.in వెబ్‌సైట్‌లో సమర్పించాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందు సీట్ల మ్యాట్రిక్స్‌ను ప్రత్యేకంగా ప్రకటిస్తామని యూనివర్సిటీ తెలిపింది. దరఖాస్తు చేసుకునే ముందు ప్రాస్పెక్టస్‌ను పూర్తిగా చదివి అర్హతలు, రిజర్వేషన్లు, అవసరమైన ధ్రువపత్రాలు, నిబంధనలను పరిశీలించాలని సూచించింది. ప్రవేశాలకు సంబంధించిన తాజా సమాచారం కోసం www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరింది.

విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని ధ్రువపత్రాలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.

  • నమోదు ప్రక్రియ ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ప్రతి కౌన్సెలింగ్ రౌండ్‌కు మళ్లీ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.

  • సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేస్తారు.

  • ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్ షెడ్యూల్, సీట్ల మ్యాట్రిక్స్‌ను KNRUHS వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

  • వెబ్ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో కళాశాలల ప్రాధాన్యత క్రమాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు