విద్యార్థులు, యువ పరిశోధకులకు కేంద్ర ప్రభుత్వం మరో మంచి అవకాశం కల్పించింది. కేంద్ర గణాంకాలు & కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) ఆధ్వర్యంలో National Internship in Official Statistics (NIOS) 2026-27 – Phase II కోసం 240 ఇంటర్న్‌షిప్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఎంపికైన అభ్యర్థులను MoSPIతో పాటు ఇతర భాగస్వామ్య కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియమించనున్నారు. ఇంటర్న్‌షిప్ వ్యవధి 2 నెలల నుంచి 6 నెలల వరకు ఉండగా, ఎంపికైన వారికి నెలకు రూ.10,000 స్టైపెండ్ అందించనున్నారు.
అర్హతలు:
అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు (రెండో సంవత్సరం పరీక్షలు పూర్తి చేసిన/హాజరైన వారు) – స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్‌లో కనీసం ఒక పేపర్ ఉండాలి. ఇంటర్‌లో కనీసం 75% మార్కులు ఉండాలి.
పీజీ లేదా రీసెర్చ్ విద్యార్థులు – గ్రాడ్యుయేషన్‌లో కనీసం 70% మార్కులు ఉండాలి.
గత రెండేళ్లలో గ్రాడ్యుయేషన్ లేదా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు – స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్‌లో కనీసం ఒక పేపర్ చదివి, కనీసం 70% మార్కులు సాధించి ఉండాలి.
దరఖాస్తు వివరాలు:
దరఖాస్తుల ప్రారంభం: 03 ఆగస్టు 2026
చివరి తేదీ: 31 ఆగస్టు 2026
అధికారిక గణాంకాల వ్యవస్థలో పనిచేసే అనుభవాన్ని పొందాలని కోరుకునే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ (https://internship.mospi.gov.in) లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.




















