ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్ర‌భుత్వ కొలువు.. SSC CHSL నోటిఫికేషన్ విడుదల!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్‌న్యూస్ అందించింది. SSC CHSL 2026 నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, కార్యాలయాల్లో 2,536 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్‌ 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

9 సెప్టెంబర్, 2026 9:42 AM•ByNarender Kumar Nangunoori

Share this article

ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్ర‌భుత్వ కొలువు.. SSC CHSL నోటిఫికేషన్ విడుదల!

Job Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL) ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రైబ్యునళ్లలో 2,536 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

భర్తీ చేసే పోస్టులు

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)

డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)

డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఏ

విద్యార్హత

అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. DEO, DEO గ్రేడ్-ఏ పోస్టులకు మాత్రం గుర్తింపు పొందిన బోర్డు నుంచి మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతి పాసై ఉండాలి.

వయోపరిమితి

2026 అక్టోబర్ 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1999 ఆగస్టు 2 నుంచి 2008 ఆగస్టు 1 మధ్య జన్మించిన వారు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో టైర్-1, టైర్-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఉంటాయి.

టైర్-1: మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలకు గంట వ్యవధి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

ఇంగ్లిష్ లాంగ్వేజ్ – 25 ప్రశ్నలు, 50 మార్కులు

జనరల్ ఇంటెలిజెన్స్ – 25 ప్రశ్నలు, 50 మార్కులు

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 25 ప్రశ్నలు, 50 మార్కులు

జనరల్ అవేర్‌నెస్ – 25 ప్రశ్నలు, 50 మార్కులు

టైర్-2: మొత్తం 405 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో నాలుగు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి. మొదటి సెక్షన్లలో ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి.

జీతం ఎంత?

ఎంపికైన వారికి పోస్టును బట్టి ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది.

LDC/JSA: రూ.19,900 – రూ.63,200

DEO: రూ.25,500 – రూ.81,100

DEO గ్రేడ్-ఏ: రూ.29,200 – రూ.92,300

దరఖాస్తు వివరాలు

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 2026 అక్టోబర్ 7

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 2026 అక్టోబర్ 8

అప్లికేషన్ కరెక్షన్ విండో: 2026 అక్టోబర్ 14 నుంచి 16 వరకు

అధికారిక వెబ్‌సైట్: ssc.gov.in

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే ఇంటర్‌ అర్హత కలిగిన అభ్యర్థులకు SSC CHSL 2026 మంచి అవకాశంగా చెప్పొచ్చు. చివరి తేదీ కోసం వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు