డిప్లొమా, ఐటీఐ అర్హతతో NCRTCలో ఉద్యోగాలు..రూ.1.15 లక్షల వరకు జీతం!.. పూర్తి వివరాలివే

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు NCRTC గుడ్‌న్యూస్ చెప్పింది. సూపర్‌వైజర్-I, జూనియర్ మెయింటెయినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 90 ఖాళీలకు సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 9, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. అర్హత, వయోపరిమితి, జీతం, ఎంపిక ప్రక్రియ వివరాలు ఇవే.

15 సెప్టెంబర్, 2026 4:21 PM•ByNarender Kumar Nangunoori

Share this article

డిప్లొమా, ఐటీఐ అర్హతతో NCRTCలో ఉద్యోగాలు..రూ.1.15 లక్షల వరకు జీతం!.. పూర్తి వివరాలివే

Job Notification | సెప్టెంబర్ 15 (జనవాణి): నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) 90 పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో సూపర్‌వైజర్-I పోస్టులు 62, జూనియర్ మెయింటెయినర్ పోస్టులు 28 ఉన్నాయి. NCRTC కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ.

విద్యార్హతలు

సూపర్‌వైజర్-I (ఆపరేషన్స్) పోస్టులకు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా అర్హత ఉండాలి. ఇతర సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. జూనియర్ మెయింటెయినర్ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ తప్పనిసరి.

వయోపరిమితి

అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. వయసును 2026 సెప్టెంబర్ 10 నాటికి లెక్కిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. PwBD అభ్యర్థులకు కేటగిరీని బట్టి 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో మినహాయింపు లభిస్తుంది.

జీతం ఎంతంటే?

సూపర్‌వైజర్-I పోస్టులకు S1 పే స్కేల్‌లో రూ.37,000–రూ.1,15,000 వరకు జీతం లభిస్తుంది. జూనియర్ మెయింటెయినర్ పోస్టులకు NS3 పే స్కేల్‌లో రూ.18,250–రూ.59,200 వరకు వేతనం ఉంటుంది. వీటితో పాటు NCRTC నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, ఉద్యోగ ప్రయోజనాలు అందుతాయి.

దరఖాస్తు ఎలా చేయాలి?

అర్హత ఉన్న అభ్యర్థులు NCRTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 2026 సెప్టెంబర్ 10న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 9, 2026న ముగుస్తుంది. SC/ST, మాజీ సైనికులు, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ.500 ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా జరుగుతుంది. పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ముఖ్యంగా ఇందులో నెగెటివ్ మార్కింగ్ లేదు. CBTలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించిన అనంతరం తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.

FullDetails:

https://ncrtc.in/wp-content/uploads/2026/09/332026VacancyNotice

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు