హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియం ఉచిత ప్రవేశం.. ఎవరికి? ఎలా వెళ్లాలి?

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రసిద్ధ సాలార్‌జంగ్ మ్యూజియాన్ని ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఈ నిర్ణయంతో విద్యార్థుల్లో చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన పెంపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

3 ఆగస్టు, 2026 3:03 PM•ByNarender Kumar Nangunoori

Share this article

హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియం ఉచిత ప్రవేశం.. ఎవరికి? ఎలా వెళ్లాలి?

Janavaani Image

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, చరిత్ర, కళలు, వారసత్వ సంపదపై అవగాహన కల్పించే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ విద్యా విహారయాత్రలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ... ఈ యాత్రలను డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సూచించింది.

ఈ అవకాశాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా గుర్తింపు పొందిన ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు కూడా ఈ ఉచిత అవకాశాన్ని వినియోగించుకుని మ్యూజియాన్ని సందర్శించవచ్చునని అధికారులు తెలిపారు. అయితే ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులకు మాత్రం మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

మ్యూజియాన్ని సందర్శించాలనుకునే పాఠశాలలు కనీసం 48 గంటల ముందే అధికారిక education.salarjungmuseum@gmail.com అనే అధికారిక ఈ-మెయిల్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవాలి. ముందస్తు సమాచారం లేకపోతే ప్రవేశంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వెంట ఉండాలి. అలాగే విద్యార్థులను విహారయాత్రకు పంపే ముందు తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతి తీసుకోవడం కూడా తప్పనిసరి చేశారు.

ప్రపంచ ప్రసిద్ధ సాలార్‌జంగ్ మ్యూజియంలో ఆసియా, ఐరోపా, దూర ప్రాచ్య దేశాలకు చెందిన వేలాది అరుదైన కళాఖండాలు, పురాతన నాణాలు, ఆయుధాలు, తివాచీలు, హస్తకళలు, చిత్రపటాలు ప్రదర్శనలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులను ఈ మ్యూజియం ఆకర్షిస్తోంది.

విద్యార్థుల్లో చరిత్ర, సంస్కృతి, వారసత్వంపై ఆసక్తి పెంచే ఈ నిర్ణయం విద్యా రంగంలో మరో మంచి ముందడుగుగా భావిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు