కొండల మధ్య మధుర గానం.. ఈ ముగ్గురు చిన్నారుల పాటకు ఫిదా అవుతున్న నెటిజన్లు!

అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు చిన్నారుల మధుర గానం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రకృతి అందాల నడుమ ‘ఏక్‌ తూ హీ యార్‌ మేరా’ పాటను ఆలపిస్తూ, చిలిపి హావభావాలతో అలరించిన సింగా, న్గమ్‌జాన్‌, లిల్లీ వీడియోకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

2 అక్టోబర్, 2026 5:41 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కొండల మధ్య మధుర గానం.. ఈ ముగ్గురు చిన్నారుల పాటకు ఫిదా అవుతున్న నెటిజన్లు!

అరుణాచల్‌ప్రదేశ్‌,అక్టోబర్ 2 (జనవాణి): చుట్టూ పచ్చని కొండలు.. ఆహ్లాదాన్ని పంచే ప్రకృతి అందాలు.. ఆ అందాల మధ్య ముగ్గురు చిన్నారుల మధుర గానం.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన సింగా, న్గమ్‌జాన్‌, లిల్లీ అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి పాడిన బాలీవుడ్‌ పాట నెట్టింట సందడి చేస్తోంది.

ఈ ముగ్గురు చిన్నారులు కలిసి ‘పతి పత్నీ ఔర్‌ వో’ చిత్రంలోని ‘ఏక్‌ తూ హీ యార్‌ మేరా’ పాటను ఆలపించారు. ప్రకృతి అందాల నడుమ కూర్చుని ఎంతో సహజంగా పాట పాడటంతో పాటు, మధ్య మధ్యలో చిన్న చిన్న స్టెప్పులతో సందడి చేశారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే ఈ వీడియోకు కోట్లకు పైగా వ్యూస్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ముగ్గురు సోదరీమణుల మధురమైన గానం, చిలిపి హావభావాలు, వారి మధ్య కనిపించే అనుబంధం అన్నింటికీ తోడు కొండల అందమైన నేపథ్యం వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీడియో చూసిన నెటిజన్లు చిన్నారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఒకే ఫ్రేమ్‌లో ఇంత క్యూట్‌నెస్‌’, ‘ట్రూ ఏంజిల్స్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ముగ్గురు సిస్టర్స్‌ మరిన్ని పాటలతో అలరించాలని కోరుకుంటూ నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు