iPhone 18 Pro కోసం ఢిల్లీలో అర్ధరాత్రి నుంచే క్యూ.. భారీగా పెరిగిన క్రేజ్!

యాపిల్‌ కొత్తగా తీసుకొచ్చిన iPhone 18 Pro, iPhone 18 Pro Max స్మార్ట్‌ఫోన్ల సాధారణ విక్రయాలు శుక్రవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. భారత్‌లోనూ ఉదయం 8 గంటల నుంచి ప్రీ-ఆర్డర్‌ చేసిన కస్టమర్లకు డెలివరీలు మొదలయ్యాయి. యాపిల్‌ స్టోర్లతోపాటు ప్రముఖ రిటెయిల్‌ స్టోర్ల వద్ద కొత్త ఐఫోన్‌ల కోసం టెక్ ప్రియులు భారీగా క్యూ కట్టారు.

18 సెప్టెంబర్, 2026 3:17 PM•ByNarender Kumar Nangunoori

Share this article

iPhone 18 Pro కోసం ఢిల్లీలో  అర్ధరాత్రి నుంచే క్యూ.. భారీగా పెరిగిన క్రేజ్!

టెక్ దిగ్గజం యాపిల్‌ కొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Max మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్ల సాధారణ విక్రయాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రీ-ఆర్డర్‌ చేసిన వినియోగదారులకు డెలివరీలు మొదలవ్వడంతోపాటు యాపిల్‌ స్టోర్లు, ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ రిటెయిల్‌ చైన్లు, ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లలోనూ నేరుగా కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. విక్రయాలు ప్రారంభం కావడానికి ముందే దేశంలోని పలు ప్రాంతాల్లో యాపిల్‌ స్టోర్ల వద్ద టెక్ ప్రియులు బారులు తీరారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తోపాటు ముంబై, బెంగళూరు తదితర ప్రధాన నగరాల్లో కొత్త ఐఫోన్‌ను తొలుత సొంతం చేసుకునేందుకు పలువురు గంటల తరబడి వేచి చూశారు. కొందరు ప్రత్యేకంగా కొత్త ఐఫోన్‌ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చారు.

ఆకట్టుకునే ఫీచర్లు

iPhone 18 Pro సిరీస్‌లో కెమెరా, పనితీరు, బ్యాటరీ, ఇంటెలిజెన్స్‌ విభాగాల్లో కీలక మార్పులు చేసినట్లు యాపిల్‌ తెలిపింది. వేరియబుల్‌ అపెర్చర్‌ టెక్నాలజీ, మెరుగైన వీడియో ఫీచర్లు, ఫొటోగ్రాఫిక్‌ స్టైల్స్‌, యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి ఫీచర్లను అందించింది. ఫోన్‌ అధికంగా వేడెక్కకుండా ప్రత్యేక కూలింగ్‌ వ్యవస్థను కూడా తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది.

యాపిల్‌ వరల్డ్‌వైడ్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ జోస్వియాక్‌ మాట్లాడుతూ.. కెమెరా, పనితీరు, బ్యాటరీ, ఇంటెలిజెన్స్‌ వంటి వినియోగదారులు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే విభాగాల్లో iPhone 18 Proలో గణనీయమైన మార్పులు చేసినట్లు తెలిపారు. వేరియబుల్‌ అపెర్చర్‌ సాంకేతికతతో ఫొటోలు, వీడియోలను మరింత సులభంగా, విభిన్నంగా చిత్రీకరించవచ్చని వివరించారు.

ధరలు ఎంతంటే?

భారత్‌లో iPhone 18 Pro ప్రారంభ ధర రూ.1,64,900గా ఉంది. iPhone 18 Pro Max ప్రారంభ ధర రూ.1,79,900 నుంచి మొదలవుతోంది.

iPhone 18 Pro ధరలు:

256GB – రూ.1,64,900

512GB – రూ.1,89,900

1TB – రూ.2,39,900

2TB – రూ.3,14,900

iPhone 18 Pro Max ధరలు:

256GB – రూ.1,79,900

512GB – రూ.2,04,900

1TB – రూ.2,54,900

2TB – రూ.3,29,900

అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఈ మోడళ్ల ధరలు సుమారు రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, భారత్‌లో తయారైన iPhone 18 Pro, Pro Max మోడళ్లు విడుదల రోజునే దేశీయ మార్కెట్లో అందుబాటులోకి రావడం కూడా ప్రత్యేకతగా నిలిచింది. ఫాక్స్‌కాన్‌, టాటా గ్రూప్‌ ద్వారా భారత్‌లో ఐఫోన్‌ తయారీ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు