కేరళ ఇకపై ‘కేరళం’.. పేరుమార్పు బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్

కేరళ రాష్ట్ర అధికారిక పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించారు.

11 ఆగస్టు, 2026 4:05 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కేరళ ఇకపై ‘కేరళం’.. పేరుమార్పు బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ, ఆగస్టు 11(జనవాణి): కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మంగళవారం విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే బిల్లును సభలో ప్రవేశపెట్టి మూజువాణి ఓటుతో ఆమోదించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చాలని కేంద్రానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లును తీసుకొచ్చింది.

విపక్షాల ఆందోళనల మధ్య ఆమోదం

బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో విపక్ష సభ్యులు పార్లమెంట్‌లో ఆందోళనకు దిగారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ బిల్లుపై ప్రక్రియను కొనసాగించిన లోక్‌సభ.. చివరకు మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది. లోక్‌సభ ఆమోదం అనంతరం బిల్లును తదుపరి ప్రక్రియ కోసం రాజ్యసభకు పంపనున్నారు. రాజ్యసభ ఆమోదం, తదుపరి రాజ్యాంగపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత పేరుమార్పు అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

‘కేరళం’ పేరుకు చారిత్రక నేపథ్యం

మలయాళ భాషలో రాష్ట్ర అధికారిక పేరును ఇప్పటికే ‘కేరళం’గా ఉపయోగిస్తున్నారు. అదే పేరును రాజ్యాంగపరంగా కూడా అధికారికంగా అమలు చేయాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కేంద్రం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది.

పార్లమెంట్‌లో విపక్షాల నిరసన

ఇదిలా ఉండగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై కూడా విపక్షాలు పార్లమెంట్‌లో నిరసన చేపట్టాయి. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు