శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం తయారీలో హలాల్ గుర్తు ఉన్న బెల్లం వినియోగంపై దాఖలైన పిటిషన్‌పై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ప్రసాదం తయారీకి అవసరమైన ముడి పదార్థాలను అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డును ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఈ-టెండర్ నిబంధనల్లోనే తగిన షరతులు చేర్చాలని సూచించింది.
11 ఏళ్లుగా మనసులో దాచుకున్న వంట వ్యాపార కలను చివరకు నిజం చేసుకున్నారు తిరువనంతపురానికి చెందిన అనిజ. ఉద్యోగం చేస్తూనే అరిటాకులో బిర్యానీ విక్రయిస్తూ కొత్త గుర్తింపు తెచ్చుకున్నారు. తొలినాళ్లలో రోజుకు ఐదారు ప్యాకెట్లు మాత్రమే అమ్ముడవగా.. ఓ యూట్యూబ్ వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు రోజుకు సుమారు 50 ప్యాకెట్ల వరకు విక్రయిస్తున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మహమ్మద్-2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు దక్కనుంది. రైతులు, బీసీలు, సామాన్య ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాస్వామిక విలువల పట్ల ఆయన నిబద్ధతను గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకుల జ్యూరీ వెల్లడించింది.
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మరో బంగారం గోల్‌మాల్ వెలుగులోకి వచ్చింది. 2012లో భక్తులు సమర్పించిన 445 గ్రాముల బంగారు కిరీటం స్ట్రాంగ్‌రూమ్ నుంచి మాయమైనట్లు తేలింది. దాని స్థానంలో అదే డిజైన్‌తో ఉన్న 240 గ్రాముల నకిలీ కిరీటం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో వెలుగులోకి వచ్చిన బంగారం అవకతవకలపై జరుగుతున్న తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది.
ఆయుర్వేద చికిత్స కోసం కేరళలో కొన్ని వారాలు గడిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చికిత్సను విజయవంతంగా ముగించుకుని రాష్ట్రానికి వీడ్కోలు పలికారు. కేరళ ప్రజల ఆతిథ్యం, వైద్యుల సేవలు, ఆలయాల ఆధ్యాత్మిక అనుభూతిని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగ సందేశం ఇచ్చారు. పవన్ సందేశానికి కేరళ సీఎం ఆత్మీయంగా స్పందిస్తూ సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.
కేరళలో ఆయుర్వేద చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాలను అనుసరించి దీపారాధన, మీనుట్టు, వేది వజిపాడు తదితర సేవల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శబరిమల ఆలయ పరిసరాల్లో సినిమా షూటింగ్‌లకు కేరళ హైకోర్టు అనుమతి నిరాకరించింది. శబరిమలతో పాటు పెరియార్ టైగర్ రిజర్వ్ పరిధిలోనూ చిత్రీకరణలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. దీంతో మోహన్‌లాల్ నటిస్తున్న ‘అతిమనోహరం’ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది.
కేరళ రాష్ట్ర అధికారిక పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించారు.