తడబాటు లేకుండా డబుల్ స్పీడ్‌లో హనుమాన్ చాలీసా.. అమెరికన్ యువకుడి పఠనం వైరల్!

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన నిక్ డీర్‌మన్ హనుమాన్ చాలీసాను అత్యంత వేగంగా, స్పష్టంగా పఠించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎలాంటి తడబాటు లేకుండా డబుల్ స్పీడ్‌లో చాలీసాను చదివిన ఆయన ఏకాగ్రత, ఉచ్చారణపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

3 అక్టోబర్, 2026 11:48 AM•ByNarender Kumar Nangunoori

Share this article

తడబాటు లేకుండా డబుల్ స్పీడ్‌లో హనుమాన్ చాలీసా.. అమెరికన్ యువకుడి పఠనం వైరల్!

Hanuman Chalisa | సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజూ ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా అమెరికాకు చెందిన నిక్ డీర్‌మన్ చేసిన ఆధ్యాత్మిక పఠనం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. టెక్సాస్‌కు చెందిన ఆయన హనుమాన్ చాలీసాను అత్యంత వేగంగా, ఎలాంటి తడబాటు లేకుండా డబుల్ స్పీడ్‌లో పఠించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

హనుమాన్ చాలీసాలోని పదాలను స్పష్టంగా పలుకుతూ, సరైన లయను కొనసాగిస్తూ నిక్ చేసిన పఠనం చాలామందిని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా చాలీసాను స్పష్టంగా చదవడానికి కొంత సమయం పడుతుంది. అయితే నిక్ మాత్రం వేగంగా పఠిస్తూనే ఉచ్చారణలోనూ స్పష్టతను కొనసాగించాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'మీరు లిరిక్స్‌ను గూగుల్ చేసి సరిచూసుకోవచ్చు' అంటూ నిక్ సరదాగా క్యాప్షన్ కూడా జతచేశాడు. వీడియో చూసిన నెటిజన్లు ఆయన ఏకాగ్రత, పట్టుదలతో పాటు హనుమాన్ చాలీసాపై చూపిస్తున్న ఆసక్తిని ప్రశంసిస్తున్నారు.

ముఖ్యంగా భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి చెందిన హనుమాన్ చాలీసాను ఓ అమెరికన్ వ్యక్తి ఇంత స్పష్టంగా పఠించడం పలువురిని ఆకట్టుకుంది. కొందరు నెటిజన్లు చాలామంది స్వదేశీయుల కంటే నిక్ ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం పఠనంలో కనిపించిన వేగం కంటే, దాని వెనుక ఉన్న కృషి, ఏకాగ్రత, ఆసక్తి మరింత ప్రశంసనీయమని పేర్కొంటున్నారు. మొత్తంగా నిక్ డీర్‌మన్ హనుమాన్ చాలీసా పఠన వీడియో భాష, దేశం, సంస్కృతులకు అతీతంగా సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు