వరంగల్: సింగరేణి బొగ్గు క్షేత్రాలు, ములుగు–భూపాలపల్లి ప్రాంతాల్లో భారీగా కోల్‌బెడ్ మీథేన్ నిల్వలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని ఎంపీ కడియం కావ్య తెలిపారు. అయితే గణనీయమైన నిల్వలు ఉన్నప్పటికీ వాటి అన్వేషణ, అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
సీబీఎం పరిశుభ్రమైన ఇంధన వనరుగా దేశ ఇంధన భద్రతకు తోడ్పడటంతో పాటు విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే భూగర్భ గనుల్లో మీథేన్ వాయువు తగ్గడం వల్ల గనుల భద్రత కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
సీబీఎం వనరుల శాస్త్రీయ అన్వేషణ, వాణిజ్య వినియోగం ద్వారా తెలంగాణ బొగ్గు గని ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పారిశ్రామికాభివృద్ధికి ఊతం లభిస్తుందని ఆమె అన్నారు.
తెలంగాణ బొగ్గు బెల్ట్‌లో సీబీఎం నిల్వలపై సమగ్ర అధ్యయనం చేపట్టి, అన్వేషణను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే అవసరమైన మౌలిక వసతులు కల్పించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.




















