అనసూయకు బిగ్ షాక్.. బోరబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు షాక్ తగిలింది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. అనసూయ వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని వారు ఆరోపించారు.

17 ఆగస్టు, 2026 5:21 PM•ByNarender Kumar Nangunoori

Share this article

అనసూయకు బిగ్ షాక్.. బోరబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Social Media Image

హైదరాబాద్, ఆగస్టు 17 (జనవాణి): ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కాషాయ పార్టీ (బీజేపీ) నేతలు.. హిందూ మతంపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ‘జై శ్రీరామ్’ పేరుతో కొందరు దాడులకు పాల్పడుతున్నారంటూ ఇటీవల అనసూయ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆమె వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని బీజేపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మాట్లాడే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని అనసూయకు సూచించారు.

అనసూయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను బీజేపీ నేతలు కోరారు. మరోవైపు ఈ వివాదంపై అనసూయ వెనక్కి తగ్గడం లేదు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల కారణంగా కొందరి అసలు స్వరూపాలు బయటకు వస్తున్నాయని పేర్కొంటూ విమర్శకులకు అనసూయ ఘాటుగా సమాధానం ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం మరింత రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు