హైదరాబాద్, సెప్టెంబర్ 8 (జనవాణి): బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకుంటూ.. అనంతరం రాళ్లు, కర్రలు, కుర్చీలతో దాడులకు దిగారు. ఈ ఘర్షణలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడినట్లు సమాచారం. ఓ మహిళా కాంగ్రెస్ కార్యకర్తపై కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరో కార్యకర్తకు చేయి విరిగినట్లు సమాచారం.
కాంగ్రెస్ కార్యకర్తల ఎర్రవల్లి ఫామ్‌హౌస్ ముట్టడి నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇదే సమయంలో కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఉన్నారన్న సమాచారంతో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా పోలీస్‌స్టేషన్ వద్దకు రావడంతో ఇరు వర్గాలు ఎదురుపడ్డాయి. దీంతో పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసింది. పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి అక్కడి నుంచి పంపించివేశారు. ఘటనతో బోయిన్‌పల్లి ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Loading Tweet...




















