బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. పలుజిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలుల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

28 జులై, 2026 9:08 AM•ByLaharika

Share this article

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం పశ్చిమ బెంగాల్–ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉండగా, ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ బాలాసోర్–క్యానింగ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాష్ట్రం మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో ఈ ప్రభావం మరింత పెరిగి అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

జూలై 27 రాత్రి నుంచి జూలై 30 వరకు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దాదాపు అన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆగస్టు 3 వరకు వర్షాల సూచన

జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు కూడా రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశమున్నప్పటికీ భారీ వర్షాల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని తెలిపింది.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలవకూడదని, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని, రైతులు కూడా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ పనులు చేపట్టాలని సూచించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు