
వర్షాలు ఆపించండి సార్..ఇంద్రుడిపై యువకుడి కంప్లైంట్
ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఓ యువకుడు విసిగిపోయాడు. దీంతో ఏకంగా ఇంద్రుడిపైనే అధికారులకు ఫిర్యాదు చేశాడు.
All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Heavy Rains.

ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఓ యువకుడు విసిగిపోయాడు. దీంతో ఏకంగా ఇంద్రుడిపైనే అధికారులకు ఫిర్యాదు చేశాడు.

తెలంగాణలో రాబోయే ఐదురోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ చేసింది. ముఖ్యంగా బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఉత్తరప్రదేశ్–మధ్యప్రదేశ్ సరిహద్దులోని చిత్రకూట్, సత్నా జిల్లాలను భారీ వరదలు ముంచెత్తాయి. మందాకిని నది ఉగ్రరూపం దాల్చడంతో చిత్రకూట్‌లో హై అలర్ట్ ప్రకటించారు. వరద బాధితులను రక్షించేందుకు ఐఏఎఫ్ హెలికాప్టర్లు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణ రక్షణే పోలీసు శాఖకు ప్రథమ ప్రాధాన్యమని జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలు, వాగులు, చెరువులు, కల్వర్టుల వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌తో పాటు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 53 అడుగులు దాటిన నీటిమట్టం శనివారం ఉదయానికి 55.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా, రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తూ తీర ప్రాంత ప్రజలు, ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో ఇల్లు కూలి గాయపడిన బాధితులను రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి గురువారం పరామర్శించారు.

రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దబజార్‌లో గురువారం భారీ వేపచెట్టు ఒక్కసారిగా నేలకూలింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రాగల 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో మూడు గంటల పాటు విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

తెలంగాణలో రాగల 48 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రాంతం నుంచి డ్రైనేజీ కాలువల ద్వారా వరద నీరు వీర్లపల్లి గ్రామంలోకి చేరడంతో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు.

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. పలుజిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలుల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.