
తెలంగాణలో ఐదురోజులు దంచికొట్టనున్న వానలు..8 జిల్లాలకు రెడ్ అలెర్ట్
తెలంగాణలో రాబోయే ఐదురోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ చేసింది. ముఖ్యంగా బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.





