ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలోకి కొత్తగా 57 మంది శాస్త్రవేత్తలు.. నియామక పత్రాలు అందజేసిన డీజీపీ

తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (TGFSL)లో కొత్తగా 57 మంది శాస్త్రవేత్తలు నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని TGFSLలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి డీజీపీ సీవీ ఆనంద్ నియామక పత్రాలు అందజేశారు.

27 జులై, 2026 7:52 PM•ByRamchandram

Share this article

ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలోకి కొత్తగా 57 మంది శాస్త్రవేత్తలు.. నియామక పత్రాలు అందజేసిన డీజీపీ

ఫోరెన్సిక్ సైన్ లేబరేటరీలో కొత్తగా శాస్త్రవేత్తగా ఎంపికైన అభ్యర్థికి నియామకపత్రం అందజేస్తున్న డీజీపీ సీవీ ఆనంద్, చిత్రంలో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయెల్

హైదరాబాద్: తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (TGFSL)లో కొత్తగా 57 మంది శాస్త్రవేత్తలు నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని TGFSLలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి డీజీపీ సీవీ ఆనంద్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగా చేరిన శాస్త్రవేత్తలకు హోం శాఖ ముఖ్య కార్రయదర్శి, ఎఫ్‌ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయెల్ స్వాగతం పలికారు. TGFSL పనితీరు, సామర్థ్యాలు, విజయాలను వారికి వివరించారు.

దేశంలోనే అత్యధిక కేసుల పరిష్కార సామర్థ్యం

టీజీఎఫ్ఎస్‌ఎల్‌లో పరిమిత శాస్త్రీయ సిబ్బంది ఉన్నప్పటికీ 80 శాతానికి పైగా కేసులను విజయవంతంగా పరిష్కరిస్తున్నట్లు శిఖా గోయెల్ తెలిపారు. ఒక్కో ఫోరెన్సిక్ నిపుణుడు పరిష్కరించే కేసుల సంఖ్య దేశంలోనే అత్యధికంగా ఉందని పేర్కొన్నారు. 2025లో 18,647 కేసులను 86 శాతం పరిష్కార రేటుతో పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రాధాన్యత, కాలపరిమితి గల కేసులను పరిశీలించి నిర్దేశించిన కాలవ్యవధిలో నివేదికలు అందించడం ద్వారా దర్యాప్తు సంస్థలకు సకాలంలో సహకారం అందిస్తున్నట్లు చెప్పారు.

డీఎన్‌ఏ విశ్లేషణ, కంప్యూటర్ ఫోరెన్సిక్, మాదక ద్రవ్యాలు, విష శాస్త్రం, ఇతర ఫోరెన్సిక్ విభాగాలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందిస్తున్నట్లు శిఖా గోయెల్ తెలిపారు. డిజిటల్ సాక్ష్యాలు, మాదకద్రవ్యాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయోగశాల సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పలు సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉండటంతో పాటు కీలక అక్రిడిటేషన్లు కూడా టీజీఎఫ్‌ఎస్‌ఎల్‌కు ఉన్నాయని వివరించారు.

36 మంది పీహెచ్‌డీ పట్టభద్రులు

ఫోరెన్సిక్ సైన్స్‌ ల్యాబ్‌లో కొత్తగా నియమితులైన 57 మందిలో 36 మంది పీహెచ్‌డీ, 12 మంది ఎంఎస్సీ, ఆరుగురు ఎంటెక్, ముగ్గురు ఎంసీఏ పట్టభద్రులు ఉన్నారని శిఖా గోయెల్ తెలిపారు. వీరి చేరికతో పోలీసు, న్యాయవ్యవస్థకు మరింత వేగంగా, శాస్త్రీయంగా విశ్వసనీయమైన ఫోరెన్సిక్ సేవలు అందించగలిగే సామర్థ్యం పెరుగుతుందని అన్నారు.

రాజీ పడొద్దు.. డీజీపీ సూచన

కొత్త క్రిమినల్ చట్టాల అమలుతో శాస్త్రీయ సాక్ష్యాల ప్రాధాన్యం మరింత పెరిగిందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. కాబట్టి ఫోరెన్సిక్ పనికి పూర్తిగా అంకిమవ్వాలని, తమ వృత్తిపరమైన నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు. ముఖ్యంగా సంచలన, తీవ్రమైన కేసుల్లో నాణ్యత విషయంలో రాజీపడకుండా, సకాలంలో నివేదికలు అందించాలన్నారు. శిక్షణ, అనుభవం, అత్యాధునిక ఫోరెన్సిక్ సౌకర్యాలను పూర్తిగా వినియోగించుకుని తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు. అత్యంత అర్హత కలిగిన 57 మంది శాస్త్రవేత్తల చేరికతో టీజీఎఫ్‌ఎస్ఎల్ సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని డీజీపీ విశ్వాసం వ్యక్తం చేశారు. మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, అత్యాధునిక పరికరాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు.

R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు