వర్షపు నీరు నిలిచినా.. వాహనాలు ఆగినా చర్యలు తప్పవు: సీఎం రేవంత్

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, ఇతర కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

22 సెప్టెంబర్, 2026 7:05 PM•ByNarender Kumar Nangunoori

Share this article

వర్షపు నీరు నిలిచినా.. వాహనాలు ఆగినా చర్యలు తప్పవు: సీఎం రేవంత్

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (జనవాణి): హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. నగరంలో వర్షపు నీరు నిలిచిపోవడం, వాహనాలు నిలిచిపోవడం వంటి పరిస్థితులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఎక్కడైనా నీరు నిలిచిన వెంటనే సిబ్బంది, అవసరమైన యంత్రాలను రంగంలోకి దించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.

జీహెచ్‌ఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు.

అదేవిధంగా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు, విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని, కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేసేలా చూడాలని ఆదేశించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారీ వర్షాల సమయంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్య తలెత్తిన వెంటనే స్పందించాలని అధికార యంత్రాంగానికి సూచించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు