భాగ్యనగరంలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్‌ నగరంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. కొండాపూర్‌లోని ఓ హోటల్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.9 లక్షల విలువైన 17.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

16 సెప్టెంబర్, 2026 12:49 PM•ByNarender Kumar Nangunoori

Share this article

భాగ్యనగరంలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

Hyderabad Excise STF officials arrested two people for allegedly selling cannabis in Kondapur

హైదరాబాద్‌,సెప్టెంబర్ 16 (జనవాణి): భాగ్యనగరంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో కొండాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఓ హోటల్‌లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అధికారులు అరెస్ట్‌ చేశారు.

అస్సాంకు చెందిన ధీరజ్‌ దాస్‌ (39), రబాలి అలీ (25) హోటల్‌లో చిన్న చిన్న ప్యాకెట్లుగా గంజాయిని విక్రయిస్తున్నట్లు ఎస్‌టీఎఫ్‌ అధికారులు గుర్తించారు. వారి వద్ద నుంచి 17.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విచారణలో నిందితులిద్దరూ గతంలో హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసినట్లు వెల్లడైంది. జీతం సరిపోకపోవడంతో గంజాయి విక్రయాల వైపు మళ్లినట్లు ఎక్సైజ్‌ విచారణలో తేలింది. అస్సాం నుంచి గంజాయిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

అరెస్టు చేసిన నిందితులను తదుపరి విచారణ కోసం కొండాపూర్‌ ఎక్సైజ్‌ పోలీసులకు ఎస్‌టీఎఫ్‌ అధికారులు అప్పగించారు. గంజాయి సరఫరా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు