హైదరాబాద్ రోడ్లపై త్వరలో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సుల సందడి

హైదరాబాద్‌ నగరంలో పర్యాటకులకు మరో కొత్త ఆకర్షణ అందుబాటులోకి రానుంది. చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGTDC) ఆధ్వర్యంలో మరో రెండు ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

22 సెప్టెంబర్, 2026 7:16 PM•ByNarender Kumar Nangunoori

Share this article

హైదరాబాద్ రోడ్లపై త్వరలో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సుల సందడి

హైదరాబాద్ రోడ్లపై త్వరలో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (జనవాణి): హైదరాబాద్‌ రోడ్లపై మరోసారి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు సందడి చేయనున్నాయి. నగరంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను పర్యాటకులకు పరిచయం చేసేందుకు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGTDC) ఆధ్వర్యంలో మరో రెండు బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సుల పైభాగం పూర్తిగా ఓపెన్‌గా ఉంటుంది. దీంతో ప్రయాణికులు నగర అందాలను వీక్షిస్తూ ప్రయాణించే అవకాశం ఉంటుంది. కింది భాగాన్ని ఎయిర్ కండిషన్డ్‌గా ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం GPS, CCTV కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆయా పర్యాటక ప్రాంతాల విశేషాలను వివరించేందుకు ప్రత్యేక గైడ్ సదుపాయం కూడా అందుబాటులో ఉండనుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆరు డబుల్ డెక్కర్ బస్సులు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. గోల్కొండ, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌ రోడ్‌తో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని వేవ్‌రాక్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఇవి పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో బస్సులో సుమారు 65 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

ఇప్పటికే నడుస్తున్న ఈ ఆరు డబుల్ డెక్కర్ బస్సులను కూడా TGTDCకి బదిలీ చేయాలని హెచ్‌ఎండీఏను పర్యాటక శాఖ కోరింది. ఈ బదిలీ ప్రక్రియ కూడా త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొత్తగా చేరనున్న రెండు ఓపెన్ టాప్ బస్సులతో హైదరాబాద్ టూరిజం మరింత ఆకర్షణీయంగా మారనుంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు

హైదరాబాద్‌లో ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు.. పూర్తి వివరాలు: Latest Telugu News | Breaking News in Telugu | తెలుగు వార్తలు