రాగల 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు.. ఆదిలాబాద్ సహా ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రాగల 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో మూడు గంటల పాటు విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

30 జులై, 2026 1:39 PM•ByRamchandram

Share this article

రాగల 24 గంటల్లో అత్యంత భారీ వర్షాలు.. ఆదిలాబాద్ సహా ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్!

హైదరాబాద్, జూలై 30 : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రాగల 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో మూడు గంటల పాటు విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇదే విషయాన్ని తెలంగాణ వెదర్‌మ్యాన్ కూడా వెల్లడించారు.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం మధ్యాహ్నం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాగల 24 గంటల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఇక మెదక్, సంగారెడ్డి, జనగాం, హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40-50కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. కాగా, హైదరాబాద్‌లో రోజంతా ఎడతెరిపి లేకుండా కాకపోయినా.. మధ్యమధ్యలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ వెల్లడించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాగులు, వంకలు, చెరువుల సమీపంలో ఉన్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు