అక్టోబరు 11 నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గా నవరాత్రుల ఉత్సవాలు..10 రోజుల పాటు అమ్మవారి దివ్య రూపాల దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 2026 దసరా నవరాత్రి మహోత్సవాల షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 11 నుంచి 20 వరకు పది రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

3 సెప్టెంబర్, 2026 3:59 PM•ByNarender Kumar Nangunoori

Share this article

అక్టోబరు 11 నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గా నవరాత్రుల ఉత్సవాలు..10 రోజుల పాటు అమ్మవారి దివ్య రూపాల దర్శనం

విజయవాడ, సెప్టెంబర్ 03 (జనవాణి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం 2026 దసరా మహోత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్‌ను ఆలయ అధికారులు విడుదల చేశారు.

అక్టోబర్ 11న ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమయ్యే ఉత్సవాలు అక్టోబర్ 20న విజయదశమి వరకు పది రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారు ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Durga Navaraatrlu

ప్రత్యేక ఆకర్షణలు

అక్టోబర్ 16 – శ్రీ సరస్వతీ దేవి అలంకారం:

మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు విద్యల తల్లి శ్రీ సరస్వతీ దేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. ఈ రోజున విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది.

అక్టోబర్ 18 – దుర్గాష్టమి:

దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అక్టోబర్ 19 – మహానవమి:

మహానవమి రోజున అమ్మవారు మహిషాసురమర్ధిని రూపంలో దర్శనమిచ్చి భక్తులకు అభయాన్ని ప్రసాదించనున్నారు.

అక్టోబర్ 20 – విజయదశమి:

విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో భక్తులను కటాక్షించనున్నారు. అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో నిర్వహించే హంసవాహనం తెప్పోత్సవంతో దసరా మహోత్సవాలు వైభవంగా ముగియనున్నాయి. దసరా నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉన్నందున ఆలయ అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు