కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కుట్ర: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు చట్టబద్ధత లేదంటూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కౌంటర్ దాఖలు చేయకుండా జాప్యం చేస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కౌంటర్ సిద్ధమైన తర్వాత దాన్ని ఆపమని ఎవరు ఆదేశించారని ఆయన ప్రశ్నించారు.

18 ఆగస్టు, 2026 4:51 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కుట్ర: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Janavaani Image

హైదరాబాద్, ఆగస్టు 18 (జనవాణి): కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కళ్యాణలక్ష్మి పథకంపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు చట్టబద్ధత లేదంటూ జూలైలో పిటిషన్ దాఖలైన వెంటనే అధికారులు పారా వైజ్ రిమార్క్స్ సిద్ధం చేశారని తెలిపారు. అనంతరం కౌంటర్‌ను సెక్రటేరియట్‌కు పంపినప్పటికీ లా డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. హైకోర్టు నాలుగు సార్లు అవకాశం ఇచ్చినా సిద్ధంగా ఉన్న కౌంటర్‌ను ఎందుకు దాఖలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. న్యాయశాఖ ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉన్నందున కౌంటర్‌ను ఆపమని చెప్పింది ఎవరో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

జీవోల ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చని రాజ్యాంగపరమైన నిబంధనలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం కోర్టులో తన వాదనను ఎందుకు వినిపించలేదని ప్రశ్నించారు. 1955లో రామ్ జావాయ కపూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నప్పటికీ అదనపు అడ్వొకేట్ జనరల్ ఎందుకు వాదించలేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు, కళ్యాణలక్ష్మి పథకాలపై వచ్చిన పిటిషన్లను అప్పుడే ఎదుర్కొని కొట్టివేయించామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్న చిత్తశుద్ధితో అప్పటి ప్రభుత్వం న్యాయపరంగా పోరాడిందని అన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు