
చార్మినార్ వద్ద హైఅలర్ట్.. ఒకవైపు గణేష్ నిమజ్జనాలు, మరోవైపు శుక్రవారం ముస్లిం ప్రార్థనలు
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని చార్మినార్, పాతబస్తీ పరిసరాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో బాంబ్ డిటెక్షన్ బృందాలు, ప్రత్యేక పోలీసు బలగాలతో తనిఖీలు చేపడుతూ సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.


