హైదరాబాద్,సెప్టెంబర్ 04 (జనవాణి): తెలంగాణ రాజకీయాల్లో కొండా కుటుంబం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలో నిర్ణయం ప్రకటిస్తా' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్‌లో కొనసాగుతారా?
మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత కొండా సురేఖ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోనని, ఎమ్మెల్యేగా కొనసాగుతూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. అయితే తాజాగా ఆమె చేసిన 'బిగ్ అప్‌డేట్' పోస్ట్‌తో తన రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచన చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కొండా మురళి వ్యాఖ్యలతో మరింత ఆసక్తి
ఇదే సమయంలో కొండా సురేఖ భర్త కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఆయన దూకుడు వ్యాఖ్యలు, తాజాగా సురేఖ చేసిన పోస్ట్ నేపథ్యంలో కొండా కుటుంబం తదుపరి అడుగు ఏంటనే ఆసక్తి పెరిగింది. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేక మరో రాజకీయ నిర్ణయం తీసుకుంటారా? అనే ప్రశ్నలకు ప్రస్తుతం స్పష్టమైన సమాధానం లేదు.
గతంలోనూ సంచలన నిర్ణయాలు
వరకు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు కొనసాగనున్నాయి. ఆమె తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.




















