మంత్రి కొండాకు బిగ్ షాక్..కొండా సురేఖ ఎపిసోడ్‌కు నేడు తెర? హైకమాండ్ కీలక నిర్ణయం

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం కీలక మలుపు తిరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే బర్తరఫ్‌కు సిఫార్సు చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో కొండా సురేఖ తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

3 సెప్టెంబర్, 2026 1:09 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మంత్రి కొండాకు బిగ్ షాక్..కొండా సురేఖ ఎపిసోడ్‌కు నేడు తెర? హైకమాండ్ కీలక నిర్ణయం

ఢిల్లీ, సెప్టెంబర్ 03 (జనవాణి): తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి గురువారం సాయంత్రం వరకు ముగింపు పలకాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశించినట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

రాజీనామా చేయకపోతే బర్తరఫ్?

సాయంత్రంలోగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేని పక్షంలో బర్తరఫ్ చర్యలు చేపట్టాల్సి వస్తుందని ఖర్గే స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేయకపోతే లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ పంపించే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ, పీసీసీ క్రమశిక్షణ కమిటీ నుంచి హైకమాండ్‌కు నివేదికలు వెళ్లినట్లు తెలుస్తోంది.

హైకమాండ్‌కు ఫిర్యాదులు..

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా వ్యవహరించే నేతలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు కాంగ్రెస్ నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తప్పనిసరి అని పార్టీ నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఖర్గేను కలిసిన కొండా సురేఖ

మరోవైపు కొండా సురేఖ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తన వాదనను వినిపించినట్లు తెలుస్తోంది. అటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్, క్రమశిక్షణ కమిటీ ప్రతినిధులు తమ అభిప్రాయాలను ఖర్గేకు వివరించినట్లు సమాచారం. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాజీనామా చేస్తారా? పార్టీకి కూడా గుడ్‌బై చెబుతారా?

మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఖర్గే సూచించినప్పటికీ, నిర్ణయాన్ని పునరాలోచించాలని కొండా సురేఖ కోరినట్లు తెలుస్తోంది. అయితే హైకమాండ్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదని సమాచారం.

బర్తరఫ్ చేయించుకోవడం కంటే స్వయంగా మంత్రి పదవికి రాజీనామా చేయడమే మంచిదనే అభిప్రాయానికి కొండా సురేఖ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీలో కొనసాగడం అవమానకరంగా భావిస్తున్న ఆమె.. కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొండా సురేఖ రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అధికారిక నిర్ణయం వచ్చే వరకు ఈ పరిణామాలపై స్పష్టత రావాల్సి ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు