కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ సిఫారసు లేఖను గవర్నర్‌కు పంపించారు. రాజీనామాకు సురేఖ అంగీకరించకపోవడంతో బర్తరఫ్ ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పలు కీలక పదవుల్లో మార్పులు చేసింది.

3 సెప్టెంబర్, 2026 2:50 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం

ఢిల్లీ, సెప్టెంబర్ 03 (జనవాణి): తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో పాటు పార్టీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై కొండా సురేఖ తన మంత్రి పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రాజీనామా చేయడానికి సురేఖ అంగీకరించకపోవడంతో బర్తరఫ్ ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తోంది. హైకమాండ్ నుంచి అనుమతి లభించిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి.. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ గవర్నర్‌కు సిఫారసు లేఖ పంపించారు.

మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి చెన్నారెడ్డిని తొలగించింది. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా నియమించింది.

అలాగే మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణిని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

కొండా సురేఖ వ్యవహారంతో పాటు ఈ తాజా నియామకాలు తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు