కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు చేయాలని న్యాయస్థానాన్నికోరిన ఏసీబీ అధికారులు..

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్టులను తాత్కాలికంగా జప్తు చేయాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు.

29 సెప్టెంబర్, 2026 1:35 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు చేయాలని న్యాయస్థానాన్నికోరిన ఏసీబీ అధికారులు..

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (జనవాణి): ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాస్‌పోర్టును తాత్కాలికంగా జప్తు చేయాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. కేటీఆర్‌తో పాటు కేసులో ఉన్న మరో ముగ్గురి పాస్‌పోర్టులపైనా ఇదే చర్య తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారికి ఏసీబీ కోర్టు లేఖ రాసింది. దీంతో కేటీఆర్ పాస్‌పోర్టు జప్తు వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్‌తో పాటు నాటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈఓ) ప్రతినిధి అల్బెర్టో లొంగోపై 2024 డిసెంబర్‌లో కేసు నమోదైంది.

ఈ కేసులో దర్యాప్తు అనంతరం ఏసీబీ అధికారులు కోర్టులో చార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం నిందితులు న్యాయస్థానంలో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పాస్‌పోర్టుల తాత్కాలిక జప్తు అంశం కేసులో తాజా పరిణామంగా మారింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు