హైదరాబాద్, సెప్టెంబర్ 8 (జనవాణి): తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం ఉన్న ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్‌ను పరామర్శించేందుకు, ఆయనకు మద్దతుగా ఎర్రవల్లి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను పోలీసులు బొల్లారం చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. తమను ఎర్రవల్లి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ కొందరు నేతలు అక్కడి నుంచి ఎర్రవల్లి వైపు పాదయాత్రగా ముందుకు సాగారు.
పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్
ఈ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పోలీసులపై ప్రశ్నలు సంధిస్తూ, తమను ఎందుకు అడ్డుకుంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మీ సీపీ, డీజీపీ నంబర్ ఇవ్వండి.. నేనే స్వయంగా మాట్లాడతా. పై నుంచి మీకు వచ్చిన ఆదేశాలు ఏంటి? కాంగ్రెస్ వాళ్లను కేసీఆర్‌పైకి పంపిస్తూ వారికి పోలీసు రక్షణ కల్పిస్తున్నారు. వారిని వదిలేసి మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటూ కేటీఆర్ పోలీసులను ప్రశ్నించారు.
‘కేసీఆర్‌ను కాపాడుకుంటాం’
పోలీసులపై తమకు నమ్మకం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమ నాయకుడు కేసీఆర్‌కు తామే రక్షణగా నిలుస్తామని స్పష్టం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి కేసీఆర్‌కు హాని కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో “రౌడీ రాజ్యం” నడుస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Loading Tweet...
Loading Tweet...




















