రోడ్డు కాంట్రాక్టర్లను వేధించొద్దు: గనులశాఖ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లను నిర్మాణ సామగ్రి అనుమతుల పేరుతో వేధించవద్దని గనుల శాఖ అధికారులకు రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు.

7 ఆగస్టు, 2026 6:10 PM•ByRalin

Share this article

రోడ్డు కాంట్రాక్టర్లను వేధించొద్దు: గనులశాఖ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం

గనుల శాఖ అధికారులతో సమావేశంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు

హైదరాబాద్, ఆగస్టు 7 (జనవాణి): రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లను నిర్మాణ సామగ్రి అనుమతుల పేరుతో వేధించవద్దని గనుల శాఖ అధికారులకు రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. చిన్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటూ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారిని వదిలేయడం సరికాదన్నారు.

శుక్రవారం సచివాలయంలో గనులు, భూగర్భశాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామితో కలిసి కోమటిరెడ్డి సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మట్టి, మెటల్‌ వంటి నిర్మాణ సామగ్రి అనుమతుల విషయంలో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. సమావేశానికి ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, టీజీఎండీసీ ఎండీ అనుదీప్ దురిశెట్టి, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ బి.వి.రావు, మైనింగ్ కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు హాజరయ్యారు.

సమావేశంలో మైనింగ్ కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్న చిన్న కాంట్రాక్టర్లపై నిర్మాణ సామగ్రి విలువకు పదింతల జరిమానాలు విధించడం సమంజసం కాదని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి అభిప్రాయపడ్డారు.

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఘటనకు దారితీసిన పరిస్థితులపై బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని మంత్రి కోమటిరెడ్డి కోరారు. రూ.5 కోట్ల అంశంపై రూ.54 కోట్ల జరిమానా విధించడం అత్యంత దారుణమని వ్యాఖ్యానించారు. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్లు చెల్లింపులు చేస్తున్నప్పటికీ వారిని వేధించడం సరికాదన్నారు.

తెలంగాణలో అత్యున్నత ప్రమాణాలతో రహదారులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హామ్) కింద రోడ్ల నిర్మాణ పనులు చేపట్టామని కోమటిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

కోమటిరెడ్డి లేవనెత్తిన అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని గనులశాఖ అధికారులను ఆదేశించారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు