హైదరాబాద్, ఆగస్టు 9 (జనవాణి): హైదరాబాద్ ఓల్డ్‌సిటీలోని బేలా శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో నిర్వహించిన అమ్మవారి కల్యాణ మహోత్సవంలో కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకున్నారు. దర్శించుకున్నారు.





















