కీలక అంశాలపై సమీక్ష
పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ సునీల్ దత్తాత్రే తట్కరే అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ చమురు సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న క్రూడాయిల్, సహజవాయువు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ నిల్వలు, అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంపై సభ్యులు సమీక్ష నిర్వహించారు.
ధరల స్థిరీకరణపై చర్చ
ఇంధన ధరల హెచ్చుతగ్గులు, వాటి నియంత్రణ, స్థిరీకరణ చర్యలతో పాటు కల్తీ నివారణ, ప్రమాదాల నియంత్రణ, వ్యర్థాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు వెల్లడించారు.
వినియోగదారుల సేవలు మెరుగుపరచాలి
వినియోగదారులకు మరింత నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూచించారు. ఇంధన రంగంలో సేవల నాణ్యత పెంపు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు.




















