15 ఏళ్ల బాలికపై ఆన్‌లైన్ వేధింపులు ప్రజాస్వామ్యానికే మచ్చ.. దీనికి కేంద్రం సమాధానం చెప్పాలి.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్

15 ఏళ్ల బాలికపై సోషల్ మీడియా వేదికగా జరిగిన ఆన్‌లైన్ వేధింపులు ప్రజాస్వామ్యానికి మచ్చ అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

4 ఆగస్టు, 2026 10:34 AM•ByRalin

Share this article

15 ఏళ్ల బాలికపై ఆన్‌లైన్ వేధింపులు ప్రజాస్వామ్యానికే మచ్చ.. దీనికి కేంద్రం సమాధానం చెప్పాలి.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్

15 ఏళ్ల బాలికపై సోషల్ మీడియా వేదికగా జరిగిన ఆన్‌లైన్ వేధింపులు ప్రజాస్వామ్యానికి మచ్చ అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలు, బాలికల భద్రత విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు.

ప్రధాని మోదీపై సోషల్ మీడియాలో రీల్ చేసినందుకు ఓ మైనర్ బాలికను లక్ష్యంగా చేసుకుని అత్యాచార, ప్రాణహాని బెదిరింపులు చేయడం అత్యంత దురదృష్టకరమని గడ్డం వంశీకృష్ణ అన్నారు. క్షమాపణ చెప్పేలా ఆమెపై ఒత్తిడి తీసుకురావడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మహిళల భద్రత పేరుతో "బేటీ బచావో బేటీ పడావో" వంటి కార్యక్రమాలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం, మహిళలు, బాలికలపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపుల విషయంలో కూడా అదే స్థాయిలో స్పందించాలని కోరారు. ప్రజా జీవితానికి సంబంధించిన ఆరోపణలపై పారదర్శకంగా స్పందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

పార్లమెంట్‌లో ప్రజల తరఫున లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానాలు ఇవ్వాలని వంశీకృష్ణ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో "అచ్చే దిన్", "మోదీ హై తో ముమ్కిన్ హై", రామ్ మందిర్ వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేసిన బీజేపీ, ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోకూడదని అన్నారు. ప్రజా జీవితానికి సంబంధించిన అన్ని ఆరోపణలపై పారదర్శకంగా స్పందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు..

సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలపై నిఘా కోసం కాకుండా నేరస్తులను గుర్తించి చట్టం ముందు నిలబెట్టేందుకు వినియోగించాలని గడ్డం వంశీకృష్ణ సూచించారు. తెలంగాణలోనూ ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో దృష్టి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలు, మహిళల భద్రత, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు