1000 రోజుల ప్రజా ప్రస్థానం.. తెలంగాణను విశ్వ వేదికపై నిలిపే వరకు కృషి చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రజల ఆకాంక్షలను కేంద్రంగా చేసుకుని సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. తెలంగాణను విశ్వ వేదికపై విజయపతాకగా నిలిపే వరకు కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

2 సెప్టెంబర్, 2026 1:15 PM•ByNarender Kumar Nangunoori

Share this article

1000 రోజుల ప్రజా ప్రస్థానం.. తెలంగాణను విశ్వ వేదికపై నిలిపే వరకు కృషి చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 02 (జనవాణి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 1000 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన సందేశాన్ని పంచుకున్నారు. జన ఆకాంక్షలే కేంద్రంగా.. త్యాగాల ఆశయాలే ఇంధనంగా సాగిన వెయ్యి రోజుల ప్రజా ప్రస్థానం ఇదని పేర్కొన్నారు. పేదల అవసరాలు, వారి ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్ర దీర్ఘకాలిక భవిష్యత్తుతో పాటు యువత, బిడ్డల ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

సకల వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా వెయ్యి రోజుల పాలన సాగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీస్సులు, లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల అండతో రాష్ట్రాన్ని విశ్వ వేదికపై విజయపతాకగా నిలిపే వరకు ఈ కృషి అవిశ్రాంతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో తనకు తోడుగా, నీడగా నిలిచిన ప్రతి ఒక్కరికీ సీఎం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో ఏర్పడిన ఈ అనుబంధం తన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

Loading Tweet...

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు