తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు కావాలి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన బీజేపీ ఎంపీలు

తెలంగాణలో గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పేదలకు గృహాల నిర్మాణానికి కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. రాష్ట్రానికి అదనపు నిధులు, మరిన్ని గ్రామీణ రహదారులు, గృహాల మంజూరుకు విజ్ఞప్తి చేశారు.

31 జులై, 2026 10:08 PM•ByLaharika

Share this article

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు కావాలి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన బీజేపీ ఎంపీలు

తెలంగాణ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న తెలంగాణ బీజేపీ ఎంపీల బృందం శుక్రవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసింది.

ఈ సందర్భంగా తెలంగాణలోని అనేక మారుమూల గ్రామాలు, పల్లెలకు ఇప్పటికీ సరైన రహదారి సౌకర్యాలు అందుబాటులో లేవని ఎంపీలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన తండాలు, ఆదివాసీ ప్రాంతాలకు మెరుగైన రోడ్డు అనుసంధానం కల్పించడంతో పాటు మండల కేంద్రాల నుంచి గ్రామ పంచాయతీల వరకు రహదారులను విస్తరించాలని కోరారు.

ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (PMGSY) కింద ఇప్పటికే అనేక గ్రామాల్లో రహదారి అభివృద్ధి పనులు జరిగినప్పటికీ, తెలంగాణకు మరిన్ని గ్రామీణ రహదారి ప్రాజెక్టులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఎత్తున గృహాలను మంజూరు చేసి వారి సొంతింటి కలను నెరవేర్చాలని కోరారు.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని ఎంపీలు విజ్ఞప్తి చేయగా, వారి అభ్యర్థనలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేశ్, రఘునందన్ రావు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు