హైడ్రాకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ఆదేశించింది.
63 కోర్టు దిక్కరణ కేసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది. లోతుకుంట ప్రైవేటు భూ వ్యవహారాల్లో హైడ్రా జోక్యాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది.




















