45 జూనియర్ కాలేజీలకు రూ.8 లక్షల చొప్పున జరిమానా.. ఫేక్‌ ఫైర్‌ ఎన్‌వోసీలపై ఇంటర్‌ బోర్డు ఉక్కుపాదం

రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో వెలుగుచూసిన నకిలీ ఫైర్‌ సేఫ్టీ ఎన్‌వోసీ (NOC) వ్యవహారంపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కఠిన చర్యలు చేపట్టింది. బోగస్‌ లేదా నకిలీ ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్లు సమర్పించిన 45 ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఒక్కో కాలేజీపై రూ.8 లక్షల చొప్పున జరిమానా విధించాలని నిర్ణయించినట్లు సమాచారం.

7 ఆగస్టు, 2026 10:53 PM•ByRalin

Share this article

45 జూనియర్ కాలేజీలకు రూ.8 లక్షల చొప్పున జరిమానా.. ఫేక్‌ ఫైర్‌ ఎన్‌వోసీలపై ఇంటర్‌ బోర్డు ఉక్కుపాదం

ఇంటర్ బోర్డు కార్యాలయం (File Photo)

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనవాణి): రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో వెలుగుచూసిన నకిలీ ఫైర్‌ సేఫ్టీ ఎన్‌వోసీ (NOC) వ్యవహారంపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కఠిన చర్యలు చేపట్టింది. బోగస్‌ లేదా నకిలీ ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్లు సమర్పించిన 45 ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఒక్కో కాలేజీపై రూ.8 లక్షల చొప్పున జరిమానా విధించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలు సమర్పించిన ఫైర్‌ సేఫ్టీ ధ్రువపత్రాలపై నిర్వహించిన పరిశీలనలో అగ్నిమాపక శాఖ జారీ చేయని నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఇంటర్‌ బోర్డు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

పరిశీలనలో పలు కాలేజీలు సమర్పించిన ఫైర్‌ ఎన్‌వోసీలు నకిలీవిగా తేలడంతో 45 కాలేజీలపై రూ.8 లక్షల చొప్పున జరిమానా విధిధించాలని నిర్ణయించినట్లు సమాచారం. నిబంధనలను ఉల్లంఘించిన విద్యాసంస్థలపై అవసరమైతే తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని, అగ్నిమాపక భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ ఫైర్‌ సేఫ్టీ ధ్రువపత్రాలపై కఠిన తనిఖీలు కొనసాగనున్నాయని అధికారులు సూచించారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు