ORR పరిధిలోని ఆటో యజమానులకు ఊరట.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండానే పర్మిట్ బదిలీకి గ్రీన్‌సిగ్నల్

ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో నడిచే పాత ఎల్‌పీజీ/సీఎన్‌జీ ఆటో రిక్షాల యజమానులకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఊరటనిచ్చింది. పాత ఆటోను స్క్రాప్ చేసి అదే సిటీ పర్మిట్‌పై కొత్త ఎల్‌పీజీ/సీఎన్‌జీ/ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసేవారికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ లేకుండానే పర్మిట్, యాజమాన్య బదిలీకి అనుమతిని ఇస్తూ రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

27 జులై, 2026 8:19 PM•ByRamchandram

Share this article

ORR పరిధిలోని ఆటో యజమానులకు ఊరట.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండానే పర్మిట్ బదిలీకి గ్రీన్‌సిగ్నల్

AI Generated Image

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో నడిచే పాత ఎల్‌పీజీ/సీఎన్‌జీ ఆటో రిక్షాల యజమానులకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఊరటనిచ్చింది. పాత ఆటోను స్క్రాప్ చేసి అదే సిటీ పర్మిట్‌పై కొత్త ఎల్‌పీజీ/సీఎన్‌జీ/ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసేవారికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ లేకుండానే పర్మిట్, యాజమాన్య బదిలీకి అనుమతిని ఇస్తూ రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం సీఎఫ్‌ఎస్‌టీ సాఫ్ట్‌వేర్ నిబంధనల ప్రకారం.. వాహన రిజిస్ట్రేషన్ లేదా పర్మిట్ బదిలీ చేయాలంటే వాహనానికి చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. దీంతో స్క్రాప్ చేయబోయే పాత వాహనానికి కూడా ఎఫ్‌సీ రెన్యువల్ చేయించాల్సి రావడంతో ఆటో యజమానులపై అదనపు భారం పడుతోంది. ఈ సమస్యపై ఆటో రిక్షా యజమానుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన రవాణా శాఖ కమిషనర్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త నిబంధనలు ఇవే..!

  • ఓఆర్ఆర్ పరిధిలోని పాత ఎల్‌పీజీ, సీఎన్‌జీ ఆటోలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ లేకుండానే యాజమాన్య, సిటీ పర్మిట్ బదిలీకి అనుమతి ఉంటుంది. అయితే బదిలీ పొందిన వ్యక్తి వాహనాన్ని ఆ ఆటోను రోడ్డుపై నడపబోనని, బదిలీ తేదీ నుంచి మూడు నెలల్లోపు తప్పనిసరిగా స్క్రాప్ చేస్తానని అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.

  • సంబంధిత రిజిస్ట్రేషన్ అథారిటీ మూడు నెలల గడువులోగా వాహనం స్క్రాప్ అయ్యేలా పర్యవేక్షించాలి. ఆ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

సీఎఫ్ఎస్‌టీ సాఫ్ట్‌వేర్‌లో కూడా ఈ తరహా బదిలీలు, అండర్‌టేకింగ్‌లు, స్క్రాపింగ్ కంప్లయెన్స్ నమోదు చేసేలా మార్పులు చేయాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశించారు. జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (హైదరాబాద్), డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు (రంగారెడ్డి, సంగారెడ్డి), జిల్లా రవాణా అధికారి (మేడ్చల్ మల్కాజిగిరి) ఈ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని సూచించారు.

R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు